కోడెలకు అస్వస్థత.. కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకుని వెళ్లిపోయిన వైనం!

  • గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి నివాళి అర్పించిన కోడెల
  • అనంతరం శ్మశానవాటికలను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్
  • మధ్యలో అస్వస్థతకు గురైన వైనం
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ ఉదయం నరసరావుపేటలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన నివాళి అర్పించారు. అనంతరం శ్మశానవాటికలను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ శ్మశానవాటికలో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించుకుని, ఇంటికి వెళ్లిపోయారు. అస్వస్థతకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
Go Back to Shorts
ap
assembly
speaker
kodela
ill

More Telugu News